కైకలూరు టౌన్ పోలీస్ వారు మరియు PTLU సంయుక్తంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో కైకలూరు సీనియర్ క్రికెట్ టీమ్ మరియు డేంజర్స్ బాయ్స్ జట్ల మధ్య హోరా హోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో మొదటి విజేతగా కైకలూరు సీనియర్ జట్టు విజయం సాధించింది.

విజయం సాధించిన క్రికెట్ టీం లకు కైకలూరు MLA శ్రీ దూలం నాగేశ్వరరావు గారి తనయులు శ్రీ దూలం ఫణి శ్యాం గారు ముఖ్య అతిధి గా పాల్గొని విజేతలుగా నిలిచిన టీమ్స్ కి అభినందనలు తెలియ చేసి బహుమతిలు అందించారు.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా డిగ్రీ కాలేజీ పూర్వ విద్యార్ధి మరియు CM జగన్ మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న DSP శ్రీ రంగబాబు గారు పాల్గొని విజేతలను అభినందించారు.

ఈ టోర్నమెంట్ ని ఆద్యంతం ముందు ఉండి నడిపించిన కైకలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాయుడు గారికి , టౌన్ SI షణ్ముఖ సాయి (Vamsi Krishna Meka) గారికి, అడవి కృష్ణ గారికి మరియు ముఖ్య అతిధులు గ విచ్చేసిన కైకలూరు ప్రెసిడెంట్ నవరత్న కుమారి గారికి కైకలూరు సీనియర్ క్రికెటర్లు మరియు ఆర్గనైజర్స్ నిమ్మల సాయి, సతీష్ కూనవరపు, పాణెం కిరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు.

కైకలూరు సీనియర్ క్రికెటర్ శ్రీ సురేంద్ర గారి అధ్వర్యంలో కైకలూరు క్రికెట్ సీనియర్ క్రికెటర్స్ అందరికి ఘన సన్మానం చేశారు.

Add a comment...