కోస్తా ప్రభ అనే పత్రికను అడ్డు పెట్టుకుని అక్రమ వసూళ్లు, బెదిరింపులకు పాల్పడిన కోస్తా ప్రభ ఎడిటర్ కూర్మ ప్రసాద్ బాబుని అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్ విధించిన కైకలూరు న్యాయమూర్తి.

కోస్తా ప్రభ ప్రసాద్ బాబు అనే దోపిడీ రాబందు రెక్కలు తెగిన రోజు.

Kosta Prabha Editor Kurma Prasad Babu Arrested by Kaikaluru Police on Extortion charges

కైకలూరు, జనవరి 28: వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క తుఫాను దెబ్బకి కొట్టుకు పోతుంది అలానే వంద అక్రమాలు చేసిన కోస్తా ప్రసాద్ బాబు ఒక్క దెబ్బకి రెక్కలు తెగి విలవిలలాడుతున్నాడు. చాలా పకడ్బందీగా, పక్కా ప్రణాళికతో ఒక అనుచరగణాన్ని పోగేసుకుని గత మూడేళ్ళుగా సాగించిన ఇతని దోపిడీ పర్వానికి ఈరోజు అరెస్ట్ ద్వారా పోలీసులు చరమగీతం పాడారు.

కోస్తా ప్రభ వసూళ్ళ పర్వం: విజయవాడలో నివసించే కోస్తా ప్రసాద్ బాబు కార్ స్టార్ట్ చేసి గుడివాడ దాటాక ముదినేపల్లిలో ఎంట్రన్స్లో మొదలవుతుంది ఈ రాబందు దోపిడీ దందా – అక్కడినుంచి కలిదిండి మండలం ఆ తర్వాత కైకలూరు మండలం ఆ తర్వాత మండవల్లి దాటి తిరిగి ముదినేపల్లి చేరుకునే లోపు ఈ దోపిడీ రాబందు వసూళ్ళ సంచి నిండకుండా ఇంటికి చేరుకున్న రోజు లేదంటే ఆశ్చర్యమే, గత మూడేళ్ళుగా కోస్తా ప్రసాద్ బాబు దినచర్య ఇది. ఈ నాలుగు మండలాల్లోని ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్ట వేసుకుని కూర్చున్న ప్రసాద్ బాబు అనుచరులు ఇతనికి స్థానిక సమాచారం అందజేస్తే అక్కడికి చేరుకుని ఈ whatsapp పత్రిక పేరు చెప్పి వసూళ్ళ దందా మొదలెడతాడు (అందులో కొంత శాతం అతనికి సమాచారం ఇచ్చిన అనుచరలకు చేరుతుంది). ఈ అక్రమాలకు అండగా వుండే మానస పత్రిక కోస్తా ప్రభ మొదలయిన దగ్గరనుంచి ఇదే వరస. గత మూడు సంవత్సరాలుగా కోస్తా ప్రసాద్ అనుచరులతో కలిసి ఎంతమంది బాధితులు బలయ్యారో లెక్కలేదు. అంబి ఇన్ఫ్రా యాజమాన్యం పైన రాసిన తప్పుడు కధనాలు బయటకు వచ్చాక గత వారం రోజులుగా కోస్తా ప్రసాద్ బాధితులు ధైర్యంగా ముందుకు రండి మీకు మేము మీకు అండగా వుంటాం అని భరోసా కల్పిస్తే ఆయన బాధితులు వందల్లోనే తేలారు. వారి భద్రత దృష్ట్యా వారి సమాచారం గోప్యంగా వుంచడం జరిగింది.

కోస్తా ప్రభ పతనానికి పునాది: ఎప్పటిలానే ఇతని దోపిడీ దందా యదేచ్చగా జరుగుతుందని ఆశించి అంబి ఇన్ఫ్రా వెంచర్ మీద కొన్ని అన్యాయం, అక్రమం ని బయట పెట్ట బోతున్న దమ్మున్న పత్రిక అంటూ తన Whatsaap పత్రికలో ట్రైలర్ రిలీజ్ చేసి ఎప్పటిలానే ఇతని స్టైల్ లో బెరించడం మొదలు పెట్టాడు, ఇది చూపించి అంబి ఇన్ఫ్రా ప్రతినిధులను బెదిరించి 3 లక్షలు పత్రిక ప్రకటనల రూపంలో డిమాండ్ చేయగా అందుకు నిరాకరించిన అంబి ఇన్ఫ్రా యాజమాన్యం మరియు ప్రతినిధుల మీద పత్రిక విలువలను, భాషను కాలరాసి హద్దులు మీరి చిల్లర రాతలు రాసాడు. అతని పూర్వపు బాధితుల్లా అంబి ఇన్ఫ్రా యాజమాన్యం తలొగ్గి ఇతను అడిగిన దోపిడీ దందా సరుకు ముడుతుంది అనే ఆశతో. కానీ జరిగిన కధ వేరు – అంబి ఇన్ఫ్రా యాజమాన్యం చట్ట ఇతని తాటాకు చప్పుళ్ళకు బెదరకుండా చట్టపరమైన పోరాటం మొదలుపెట్టి కోస్తా ప్రసాద్ తప్పుద్ కధనాలపైన పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయగా పోలీస్ వారు ఇతని నేర చరిత్ర, దోపిడి పర్వాలను వెలికి తీయడం మొదలెట్టారు, ఇతని ధన దాహానికి బలయిన బాధితులను జల్లెడ పట్టారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందల్లో ఈ బాధితుల లెక్క తేలింది. చిన్న లేదు, పెద్ద లేదు, పేద లేదు, ధనిక లేదు దొరికిన ప్రతి చోటా కోస్తా ప్రభ పత్రికను అడ్డు పెట్టుకుని జర్నలిజం విలువలను పాతాళానికి తొక్కేసి అందిన కాడికి దోపిడీ చేసేవాడు. అంబి ఇన్ఫ్రా యాజమాన్యం చేసిన చట్టపరమైన పోరాటం, కృషి వలన కోస్తా ప్రసాద్ బాబు దోపిడీ రాజ్యాన్ని కూకటివేళ్ళతో పెకిలించడానికి ఈరోజు అతని అరెస్ట్ ద్వారా పునాదులు పడ్డాయి.

కోస్తా ప్రభ ప్రసాద్ బాబు అరెస్ట్: ముదినేపల్లి మండలం, ప్రొద్దువాక గ్రామం వాస్తవ్యులు కూర్మ త్యాగరాజు (లేట్) గారి కుమారుడు కూర్మ ప్రసాద్ బాబు మీద IPC సెక్షన్ 386: బెదిరించి దోపిడీ చేయుట, సెక్షన్ 501: పరువు నష్టం కలిగించే వార్తలు ప్రచురించడం, సెక్షన్ 506: నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం మరియు IT ఆక్ట్ 2008 sec 74: తప్పుడు ప్రచురణలు సోషల్ మీడియాలో షేర్ చేయడం లాంటి వివిధ సెక్తన్ల ప్రకారం కైకలూరు పోలీస్ స్టేషన్ నందు గురువారం FIR నమోదు చేయడం జరిగింది. అనంతరం కోర్టులో హాజరుపరుచగా న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించారు.

ఈ కేసుని విచారించిన జిల్లా SC, ST సెల్ DSP మోజెస్ పాల్ గారు తెలిపిన వివరాల ప్రకారం కోస్తా ప్రభ అనే కైకలూరు ప్రాంతీయ పత్రిక ఎడిటర్ ప్రసాద్ బాబు ఇటీవల కైకలూరులో శ్రీ అంబి ఇన్‌ఫ్రా లిమిటెడ్ మేనేజింగ్ పార్టనర్ నరేంద్ర క్రాంతిలాల్ పటేల్ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న బృందావన్ కాలనీ లే-అవుట్లో ప్లాట్ల వ్యాపారం చేస్తుండగా. సంస్థ తరపున జనరల్ పవర్ పొందిన వలివర్తి దుర్గాప్రసాద్ వద్దకు వెళ్ళి తన పత్రికకు రూ. 3 లక్షలు డబ్బుని ప్రకటనల రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు దుర్గాప్రసాద్ నిరాకరించడంతో అతనిని దుర్భాషలాడి నీ అంతు చూస్తానని బెదిరించి ఎక్కడినుంచో వచ్చి ఇక్కడ వ్యాపారం ఎలా సాగిస్తావని హెచ్చరించాడు. నిన్ను చంపేస్తే దిక్కెవరని బెదిరించడం తోపాటు దుర్గాప్రసాద్ గారి దగ్గరనుంచి 10 వేల రూపాయాలు బలవంతంగా తీసుకువెళ్ళాడు. అంతేకాకుండా ఈ నెల 18న ‘అక్కడ అరెస్టులు ఇక్కడ ప్రకంపనలు.. ఏంటా లింకులు’ అంటూ తన పత్రికలో కధనం ప్రచురించాడు. సదరు కధనంలో ఇటీవల అహ్మదాబాద్ లో బ్యాంకు రుణాలు ఎగొట్టిన కేసులో అరెస్టు అయిన జై అంబి గౌరీ కెమికల్స్ లిమిటెడ్ డైరెక్టరైన నరేంద్రకుమార్ పటేల్ ను శ్రీ అంబి ఇన్ ఫ్రా లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ పార్టనర్‌గా అభివర్ణిస్తూ నరేంద్రకుమార్ పటేల్ స్టేట్ బ్యాంక్ కు రూ. 65 కోట్లు బకాయి ఎగ్గొట్టి 2015లో విదేశాలకు పారిపోయినట్టు, ఆయన కోసం సిబిఐ, ఇడి గాలిస్తున్నట్టు, 17న ఆయనను ఆహ్మదాబాద్ విమానాశ్రయంలో ఇడి అధికారులు అరెస్టు చేసినట్టు, అలాగే, సదరు నరేంద్రకుమార్ నిబంధనలు అతిక్రమించి కైకలూరులో వెంచర్ అనుమతులు పొందినట్లు, వారి నుండి ప్లాట్లు కొనుగోలు చేసిన కస్టమర్ల పరిస్థితి ఏమిటన్నట్టు, కొనుగోలుదారులు సతమతమవుతున్నట్టు తన పత్రికలో తప్పుడు కథనాలు ప్రచురించాడు. అదేవిధంగా 19న వాట్సాప్ గ్రూపుల్లో కోస్తా ప్రభ దినపత్రిక 2వ పేజీలో ‘అంబి ఎస్టేట్లో తుఫాన్ ప్రభావం’ అనే శీర్షికన మరో కథనం ప్రచురించాడు. దానిలో అంబి ఎస్టేట్‌లో ఏదో కుంభకోణం జరిగిందని, సదరు విషయమై విచారణ చేసేందుకు సిబిఐ త్వరలో రానుందని, ఎవరో రాజకీయ నాయకులు వారి వెనుక ఉన్నారని, టెన్షన్ పడుతున్నారని, ప్లాట్లు కొన్నవారు ఆందోళనకు గురవుతున్నారని, జనరల్ పవరకు ఉపయోగించిన డాక్యుమెంట్లు నకిలీవని, రిజిస్ట్రేషన్లు చెల్లవని,మధ్యతరగతి ప్రజలను మోసం చేస్తున్నట్టు సదరు కథనంలో అసత్యాలు, అభూత కల్పనలు రాశాడు. వాస్తవంగా శ్రీ అంబి ఇన్‌ఫ్రా కంపెనీ మేనేజింగ్ పార్టనర్ అయిన నరేంద్ర క్రాంతిలాల్ పటేల్ SBIకి ఎలాంటి బాకీ పడలేదని, సీబీఐ & ఇడి అధికారులు అరెస్టు చేయడం జరగలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న శ్రీ అంబి ఇన్ ప్రా లిమిటెడ్ తరపున పవర్ ఆఫ్ అటార్నీ పొందిన వి.దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ప్రసాద్ బాబుపై టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతనిపై ఐపిసి సెక్షన్ 386, 501, 506, ఐటీయాక్ట్ 74 కింద కేసు నమోదు చేశారు. మచిలీపట్నం ఎస్సీ, ఎస్టీ సెల్ 1వ డిఎస్పీ బి.మోజెస్ పాల్ విచారణ నిర్వహించి గురువారం కైకలూరులో ప్రసాద్ బాబును అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి అతనికి ఫిబ్రవరి 10 వరకు రిమాండ్ విధించారు. నిందితుడిపై గతంలో కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో 2014లో సెక్షన్ 500, రెడ్ విత్ 3 & 4, 2019లో 498ఎ, 3 & 4 ఆఫ్ డిపి యాక్ట్ కేసులు నమొదైనట్టు ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ తన విచారణలో పేర్కొన్నారు.

ఇక ముందు కోస్తా ప్రభ పత్రిక ఎడిటర్ ప్రసాద్ బాబుకి ఏమి జరగబోతుంది?

1. ప్రసాద్ బాబు పైన అంబి ఇన్ఫ్రా మొదలు పెట్టిన చట్టపరమైన పోరాటం తెలుసుకున్న ప్రసాద్ బాబు భార్య శ్రీమతి విజయ గారు తన భర్త తన కుటుంబాన్ని రోడ్డున పడేసిన వైనాన్ని మీడియా ముందుకి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు ఆ తర్వాత దళిత నాయకులను, జిల్లా SP గారిని కలిసి తనకు, తన పిల్లలకు న్యాయం చేయాల్సిందిగా కోరారు – శ్రీమతి విజయ గారికి ఎలాంటి న్యాయం జరగబోతుంది?

Kosta Prabha Prasad’s wife Smt Vijaya with Krishna District SP

2. అంబి ఇన్ఫ్రా బాటలో అనేకమంది బాదితులు ప్రసాద్ బాబు పైన పిర్యాదు చేయడానికి కైకలూరు పోలీస్ స్టేషన్ బాట పట్టారు వీరి కంప్లైంట్స్ ద్వారా మరిన్ని సార్లు అరెస్ట్ అయ్యే అవకాశం వుందని సమాచారం. కోస్తా ప్రసాద్ బాబు బాదితులకు ఎలాంటి న్యాయం జరగబోతుంది?

3. RNI (REGISTRAR OF NEWSPAPERS FOR INDIA) నిభంధనల ప్రకారం ప్రతి పత్రిక రోజు 2500 కాపీల పైన ప్రింట్ చేయాలి, కోస్తా ప్రభ పత్రికను ప్రతి రోజు కేవలం DTP చేసి whatsapp గ్రూప్ లలో PDF రూపంలో షేర్ చేయడం తప్ప ప్రింట్ చేసిన సందర్భాలు తక్కువ, దీని పైన మరియు కోస్తా ప్రభ పత్రికను అడ్డుపెట్టుకుని చేస్తున్న దోపిడీల చిట్టా RNI వారికి పిర్యాదు వెళ్ళింది.
RNI వారు కోస్తా ప్రభ లైసెన్స్ రద్దు చేయబోతున్నారా?

4. కోస్తా ప్రసాద్ బాబు గత మూడేళ్ళుగా కైకలూరు నియజకవర్గం నాలుగు మండలాల్లో చేసిన దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి డిపార్టుమెంటు వారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇతను ప్రభుత్వ కార్యాలయాల్లోకి అడుగుపెట్టి దోపిడీ బెదిరింపులకు పాల్పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు?

5. ప్రసాద్ బాబు భార్య మరియు ఇతర కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ మరియు వారు ఇచ్చిన సర్టిఫికెట్స్ ఆధారాలు అతను BC.C కులానికి చెందిన వ్యక్తి అని SC సామజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు అని చెప్తున్నాయి వీటి ఆధారంగా అతని SC సర్టిఫికేట్ చినిగిపోబోతుందా? ఇది చినిగిపోయాక ఇంత కాలం SC అని చెప్పుకుని అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం అట్రాసిటీ బాదితులకు ఇచ్చే పరిహారాల మీద బ్రతికిన కోస్తా ప్రసాద్ బాబు పైన అక్రమ అట్రాసిటీ కేసులు పెట్టినందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు?

ఈ అంశాల మీద కోస్తా పత్రికను షేర్ చేసే whatsaap గ్రూప్ల లోనే ప్రజలు విపరీతంగా చర్చించుకుంటున్నారు…

Add a comment...