కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారు వారి తనయులు వినయ్ కుమార్, శ్యామ్ ఫణి కుమార్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.స్. జగన్మోహనరెడ్డి గారిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్బంగా MLA DNR గారు కైకలూరు నియోజకవర్గంలోని పలు సమస్యలను వివరించారు, అలాగే ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు C. M. గారికి MLA DNR గారు వివరించారు. కైకలూరు నియోజకవర్గం పంచాయతీ ఎన్నికల ఫలితాలు పైన C. M. గారు అభినందనలు తెలిపారు. అలాగే C. M. గారు త్వరలోనే కొల్లేరు, ఉప్పుటేరు పైన నిర్మాణం చేసే రెగ్యులేటర్ పనులకు టెండర్స్ పిలవడం జరుగుతుంది అని, టెండర్స్ జరిగిన వెంటనే C. M. గారు శంకుస్థాపన వస్తానని తెలిపారు. ముఖ్యంగా కొల్లేరు బౌండ్రీ 10 కిలోమీటర్లు చుట్టూ ఇటీవల అధికారులు ఏటువంటి ఇండస్ట్రీస్ నిర్మాణం చేయకూడదు అని జీవో ఇచ్చారు అని C. M. గారి దృష్టికి MLA DNR గారు తీసుకువెళ్లారు, వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు కొల్లేరు 2 జిల్లాల ప్రాంతాల వారికీ ఆక్వా ఇండస్ట్రీస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి వై.స్. జగన్మోహనరెడ్డి గారికి, వినయ్ కుమార్ గారు, శ్యామ్ ఫణికుమార్ గారు కృతజ్ఞతలు తెలిపారు.

Add a comment...