– చెలరేగిన హింస

అలెగ్రే (బ్రెజిల్‌) : బ్రెజిల్‌లోని ఒక స్టోర్‌లో సెక్యూరిటీ గార్డులు చేతిలో ఒక నల్లజాతీయుడు హత్యకు గురైన సంఘటనతో దేశమంతటా హింస చెలరేగింది. ఈ హత్య జరిగిన పోర్టో అలెగ్రే నగరంలోని క్యారీఫోర్‌ సూపర్‌ మార్కెట్‌పై శుక్రవారం పెద్దసంఖ్యలో నిరసనకారులు దాడి చేశారు. నల్లజాతీయుడు తనపై దాడి చేస్తు న్నాడని సూపర్‌ మార్కెట్‌ ఉద్యోగి ఒకరు సెక్యూరిటీ గార్డులకు చెప్ప డంతో వారు అతన్ని చనిపోయే వరకూ కొట్టారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన మీడియా, సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచార మయింది. పుటేజ్‌ల్లో నల్లజాతీయుడుపై దారుణంగా దాడి చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. సూపర్‌ మార్కెట్‌పై దాడికి దిగిన నిరసనకారులు భవనం అద్డాలను, ద్వారాలను ధ్వంసం చేశారు. పార్కింగ్‌లో ఉన్న సూపర్‌ మార్కెట్‌ డెలవరీ వాహనాలను ధ్వంసం చేశారు. నిరసనకా రులను చెదరకొట్టడానికి పోలీసులు టియర్‌ గ్యాస్‌ ఉపయోగించాల్సి వచ్చింది. సౌ పౌలో, రియో డె జనెరియో నగరాల్లో ఉన్న కార్యీఫోర్‌ సూపర్‌ మార్కెట్‌ భవనాలపైనా నిరసన కారులు దాడికి దిగారు.

Courtesy Nava Telangana

Add a comment...