కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారిని ఆయన నివాసం వద్ద ఆలపాడు గ్రామ పంచాయతీ నుంచి పడమట శేషావతారం గారు వారి మిత్రులు పార్టీ నాయకులు కలసి మాట్లాడారు. ఈ సందర్బంగా MLA DNR గారు మాట్లాడుతూ ఆలపాడు గ్రామ పంచాయతీ అభివృద్ధి పడమట శేషావతారం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అని అలాగే ఆలపాడు -పల్లెవాడ పంట కాల్వ తవ్వకానికి అధికారులు అనుమతులు మంజూరు చేశారు అని, త్వరలోనే శేషావతారం గారి ఆధ్వర్యంలో పనులు ప్రారంభిస్తారు అని అన్నారు. రాబోయే రోజులలో పడమట శేషావతారం గారికి నీటి సంఘం అధ్యక్షులుగా నియమిస్తాము అని, ఆలపాడు అభివృద్ధికి నా పూర్తి సహకారం అందిస్తాను అని అన్నారు. అలాగే యూత్ నుంచి శాఖమూరి సాయి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాసిపల్లి శ్రీనివాస్, వాసిపల్లి సమాధానం, బేతాళ కోటయ్య, అమృత చిన్నబాబు, బండి విష్ణు, శాఖమూరి అమ్మన రాజా, అంబేద్కర్, నల్లగాంచు బాబులు, పడమట నాగార్జున, పరసా తిరుపతిరావు, పాశం నాగేశ్వరరావు, పాశం బాబురావు, సలాది నగేష్, సలాది వెంకన్న, సుందర రాంబాబు, వెలవేల వీరాంజనేయులు, ఉమ్మితి సుదీర్ తదితరులు పాల్గొన్నారు.

Add a comment...